News
తెదేపా, వైకాపా కౌన్సిలర్ల ఘర్షణ
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.ఇటీవల వైకాపా నుంచి 10 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తెదేపాలోకి రావడంతో గుడివాడ మున్సిపాలిటీ తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా కైవసం తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఎమ్మెల్యే కొడాలి నానితో సహా వైకాపా కౌన్సిలర్లు.. ఛైర్మన్‌ను మీటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తెదేపా, వైకాపా వర్గాల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాల పిడుగుద్దులతో సమావేశం రసాభాసగా మారిపోయింది. పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ సమయంలో సమావేశం నిర్వహించడానికి సాధ్యం కాకపోవడంతో అజెండాలోని 44 అంశాలకు ఆమోదం తెలిపి వాయిదా వేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








